మూడో రోజూ లాభాలు..
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 529 పాయింట్లు బలపడి 46,973 వద్దకు చేరింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 13,749 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ సానుకూలతలు, ఫార్మా, బ్యాంకింగ్ ఇతర హెవీ వెయిట్ షేర్ల దన్ను లాభాలకు ప్రధాన కారణం.
- సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
- ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.