తెలంగాణ

telangana

ETV Bharat / business

మెరిసిన స్టాక్ మార్కెట్లు- బ్యాంకింగ్ షేర్లు భళా

Stock market live updates
లాభాల్లో స్టాక్​ మార్కెట్లు-సెన్సెక్స్​ 359 పాయింట్లు ప్లస్​

By

Published : Apr 1, 2021, 9:20 AM IST

Updated : Apr 1, 2021, 3:50 PM IST

15:42 April 01

50 వేల పైకి సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 521 పాయింట్ల లాభంతో 50,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 14,867 వద్దకు చేరింది.

బ్యాంకింగ్, లోహ, వాహన షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్​ఫార్మా, బజాజ్​ ఫినాన్స్ లాభ పడ్డాయి.
  • హెచ్​యూఎల్​, నెస్లే, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టీసీఎస్​, టైటాన్​ షేర్లు నష్టపోయాయి.

13:30 April 01

మళ్లీ లాభాల్లోకి సూచీలు..

స్టాక్​ మార్కెట్లు మిడ్​ సెషన్ తర్వాత మళ్లీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 360 పాయింట్లు పెరిగి.. 49 వేల 866 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 122 పాయింట్లకుపైగా లాభంతో.. 14,813 వద్ద కొనసాగుతోంది.

  • అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, నెస్లే, హెచ్​యూఎల్​, ఎం&ఎం, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి

10:30 April 01

దేశీయ స్టాక్​ మార్కెట్లలో లాభాల జోరు కాస్త తగ్గింది. సెన్సెక్స్ 50, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.

09:05 April 01

లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మద్దతుగా నిలిచిన వేళ.. ఆరంభ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇక కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 359 పాయింట్ల లాభంతో 49,868 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 125 పాయింట్లకు పైగా నష్టపోయి 14,811 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Apr 1, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details