బజాజ్ ఫినాన్స్ జంట షేర్లు కుదేలు..
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 870 పాయింట్లు కోల్పోయి.. 49,917 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా నష్టంతో 14,788 వద్ద ట్రేడవుతోంది.
జనవరిలో పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ, ప్రభుత్వం పెట్టుకున్న ప్రామాణిక స్థాయికన్నా అధికంగా నమోదవడం వంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనితో పాటు దేశంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఐటీ మినహా మిగత ఆన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆర్థిక షేర్లు ప్రధానంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
- టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో సానుకూలంగా స్పందిస్తున్నాయి.
- యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.