తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల కొత్త రికార్డులు- నిఫ్టీ@13,873

STOCKS LIVE UPDATES
అంతర్జాతీయ పవనాలతో మార్కెట్ల జోరు

By

Published : Dec 28, 2020, 9:25 AM IST

Updated : Dec 28, 2020, 3:50 PM IST

15:44 December 28

47,350పైకి సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 47,354 వద్దకు చేరింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,873 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలిచాయి. కరోనా కొత్త రకం భయాలున్నా ఈ స్థాయిలో సూచీలు పుంజుకోవడం విశేషం.

  • ఎస్​బీఐ, టైటాన్, ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలను గడించాయి.
  • హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్, బజాజ్ ఫిన్​సర్వ్ నష్టపోయాయి.

10:08 December 28

13,850కి చేరువలో నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా పెరిగి 47,275 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా లాభంతో 13,842 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల పవనాలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్​ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, నిక్కీ, సియోల్​, హాంగ్​సెంగ్ సూచీలూ సోమవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.31 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 51.14 డాలర్ల వద్ద ఉంది.

09:09 December 28

నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధి

మూడు రోజుల విరామం తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలతో బొంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 360 పాయింట్లు వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతం 47,335 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​ 30 షేర్లలో టీసీఎస్ మినహా అన్ని లాభాల్లోనే పయనిస్తున్నాయి. ఓఎన్​జీసీ షేరు అత్యధికంగా 1.34 శాతం వృద్ధి చెందింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే సెషన్ ప్రారంభించింది. 95 పాయింట్లు ఎగబాకి.. 13,884 వద్ద కదలాడుతోంది.

Last Updated : Dec 28, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details