తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా 2.0పై ఆందోళనలు- 49వేల దిగువకు సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్లు వార్తలు

At the end of the trading session on Wednesday, the BSE Sensex gained 1,148 points to close at 51,444 and NSE Nifty climbed 326 points to end at 15,245.

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Mar 25, 2021, 9:23 AM IST

Updated : Mar 25, 2021, 2:24 PM IST

14:16 March 25

14,400 దిగువకు నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 530 పాయింట్లు కోల్పోయి 48,700 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంతో 14,393 వద్ద ట్రేడవుతోంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్​, బజాజ్​ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

13:34 March 25

30 షేర్ల ఇండెక్స్..

నిఫ్టీ 230 మైనస్​..

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. సెన్సెక్స్ 760 పాయింట్లకుపైగా క్షీణించి.. 48,419 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా కోల్పోయి 14,319 వద్ద కొనసాగుతోంది.

11:43 March 25

మారుతీ సుజుకీ 4 శాతం డౌన్​..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 580 పాయింట్లకుపైగా కోల్పోయి 48,610 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 180 పాయింట్లు క్షీణించి.. 14,372 వద్ద కొనసాగుతోంది.

విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారీ మొత్తాల్లో ఉపసంహరించుకుంటుండటం, దేశంలో రెండో దశ కరోనా విజృంభణ తీవ్రమవుతుండటం వంటి అంశాలు.. నష్టాలకు ప్రధాన కారణలుగా తెలుస్తోంది. దాదాపు అన్ని రంగాలు ఒడుడొడుకులను ఎదుర్కొంటున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో ఎల్​&టీ మాత్రమే లాభాల్లో ఉంది. మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, అల్ట్రాటెక్​ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:17 March 25

లైవ్​: స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల మధ్య.. సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

138 పాయింట్లు కోల్పోయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... 49,041 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

30 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 14,518 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Mar 25, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details