అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు, మెటల్, పవర్ సూచీలు ఒక శాతం మేర నష్టపోవటం వల్ల దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ 1-5 శాతం మేర నష్టాల్లోకి జారుకోవటమూ ఇందుకు కారణంగా తెలుస్తోంది.
- బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్- 160 పాయింట్లు కోల్పోయి 52,612 వద్ద కొనసాగుతోంది.
- జాతీయ స్టాక్స్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 15,803 వద్ద ట్రేడవుతోంది.