తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో భారీ నష్టాలు- సెన్సెక్స్ 487 మైనస్​ - american markets

STOCKS LIVE
స్టాక్​ మార్కెట్లు లైవ్​

By

Published : Mar 12, 2021, 9:23 AM IST

Updated : Mar 12, 2021, 3:40 PM IST

15:37 March 12

50,800 దిగువకు సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు తగ్గి 50,792 వద్దకు చేరింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది.  

ఆరంభంలో భారీ లాభాలతో ఉత్సాహంగా సాగిన సూచీలు.. మిడ్​ సెషన్​ తర్వాత ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. వాహన, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణం.

  • పవర్​గ్రిడ్​, ఓఎన్​జీసీ,టైటాన్​, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాలను నమోదు చేశాయి.
  • బజాజ్​ ఆటో, మారుతీ, రిలయన్స్, సన్​ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చదవండి:షేర్లలో మదుపు.. ఈ పన్ను నిబంధనలు తెలుసా?

13:54 March 12

15,100 మార్క్​ కోల్పోయిన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి.. నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా కోల్పోయి 50,993 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంతో 15,086వద్ద కొనసాగుతోంది.

వాహన, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తుతున్న అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

  • పవర్​గ్రిడ్, టైటాన్​, ఇన్ఫోసిస్, ఓఎన్​జీసీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • మారుతీ, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్​ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్​ నష్టాల్లో ఉన్నాయి.

12:32 March 12

ఆటో, ఫార్మాలో అమ్మకాలు..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్ తర్వాత భారీ లాభాల నుంచి క్రమంగా వెనక్కి తగ్గుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభాతో 51,502 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంతో 15,231 వద్ద కొనసాగుతోంది.

వాహన, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లలో నమోదవుతున్న అమ్మకాలు లాభాలను పరిమితం చేస్తున్నాయి.

  • పవర్​గ్రిడ్, టైటాన్​, ఎల్​&టీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, మారుతీ, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:29 March 12

51 వేల 600 ఎగువన..

ఆరంభంలో 500కుపైగా పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​ కాస్త వెనక్కితగ్గింది. ప్రస్తుతం.. 340 పాయింట్లు పెరిగి 51 వేల 620 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో.. 15 వేల 300 మార్కు దిగువకు చేరింది.

ఐఓసీ, బీపీసీఎల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, లార్సెన్​, టాటా స్టీల్​ లాభాల్లో ఉన్నాయి.

ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, డా.రెడ్డీస్​ ల్యాబ్స్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

07:54 March 12

లైవ్​: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-51 వేల దిగువకు సెన్సెక్స్

దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలోనే 470కిపైగా పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 488 పాయింట్ల లాభంతో 51 వేల 767 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో 15 వేల 311 వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా సానుకూలతలు.. దేశీయ సూచీల లాభాలకు కారణం. 

లాభనష్టాల్లో..

టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఐఓసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, గెయిల్​ రాణిస్తున్నాయి. 

హీరో మోటోకార్ప్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, బజాజ్​ ఆటో, అదానీ పోర్ట్స్​ డీలాపడ్డాయి. 

ఇదీ చూడండి: ప్రైవేటీకరణను నిరసిస్తూ రెండు రోజులు బ్యాంకులు బంద్​!

Last Updated : Mar 12, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details