కరోనా కాలంలోనూ లాభాల జోరు చూపిన ఇన్ఫోసిస్.. దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఇన్ఫీ దన్నుతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 420 పాయింట్లు లాభపడింది. చివరకు 36,472 వద్ద ట్రేడింగ్ ముగించింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే పయనించింది. 122 పాయింట్లు ఎగబాకి 10,740 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివివే
జూన్ త్రైమాసికంలో రూ.4272 కోట్ల నికర లాభం గడించినట్లు ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో సంస్థ షేరు దూసుకుపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 9 శాతానికి పైగా లాభపడింది.
ఇన్ఫోసిస్‌తో పాటు మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ లాభాల్లో పయనించాయి.
మరోవైపు టెక్ మహీంద్ర, ఐటీసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ, రిలయన్స్ సంస్థలు నష్టాలు చవిచూశాయి.