వరుస నష్టాల అనంతరం.. స్టాక్ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభ సెషన్లో భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు వేగంగా లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 1,325 పాయింట్ల మేర లాభపడి 34,103 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 365 పాయింట్లు పెరిగి 9,955 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ట్రేడింగ్ ఆరంభంలో రికార్డు నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. తొలుత సెన్సెక్స్ 3500 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. ఈ సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి ప్రారంభమయ్యాక బుల్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ దాదాపు 5000 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 1600 పాయింట్ల మేర కోలుకుంది. ఇది రికార్డు