అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు ఐటీ, ఎఫ్ఎమ్సీజీ షేర్ల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) భారీ లాభాలను గడించాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. బీఎస్ఈ(BSE Sensex) మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 0.5 శాతం మేర లాభపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్చ్చేంజీ సూచీ సెన్సెక్స్ 514 పాయింట్ల లాభంతో 57,852 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 57,892 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ జీవిత కాల గరిష్ఠం 17,245ను తాకి చివరకు 158 పాయింట్ల లాభంతో 17,234 పాయింట్ల వద్ద స్థిరపడింది.