తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటుపోట్ల నడుమ ఫ్లాట్​గా మార్కెట్ సూచీలు - స్టాక్ మార్కెట్లు

లాభాల స్వీకరణతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 14, నిఫ్టీ 15 పాయింట్లు లాభపడ్డాయి.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 11, 2020, 3:39 PM IST

Updated : Sep 11, 2020, 5:36 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఫ్లాట్​గా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 38,855 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 15 పాయింట్లు మెరుగుపడి 11,464 పాయింట్లకు చేరుకుంది.

మార్కెట్​ ముఖ్యాంశాలు

లాభనష్టాల్లో..

టెక్​ మహీంద్రా, టీసీఎస్​, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్​ ఫైనాన్స్, టైటాన్​, ఇన్ఫోసిస్​ రాణించాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఓఎన్​జీసీ వెనకబడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ప్రధాన మార్కెట్లైన షాంఘై, హాంకాంగ్​, జపాన్, దక్షిణ కొరియా లాభాలతో ముగిశాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకం 7 పైసలు బలహీనపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 73.53 వద్ద స్థిరపడింది.

చమురు..

బ్రెంట్​ చమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్​కు 40 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:త్వరలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ పబ్లిక్‌ ఇష్యూ!

Last Updated : Sep 11, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details