స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 447 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,079 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 125 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,258 వద్దకు చేరింది.
ఆర్బీఐ జోష్..
ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అంచనాలు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇతర సానుకూలతలు మార్కెట్లను లాభాల బాట పట్టించినట్లు చెబుతున్నారు. బ్యాంకింగ్ షేర్లు లాభాలకు ప్రధానంగా ఊతమందించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 45,148 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 44,665 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,280 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,152 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..