స్థూల ఆర్థిక గణాంకాలు, 2021-22 తొలి త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కూడా మదుపరులు దృష్టి సారించే వీలుందని అంటున్నారు.
అంతర్జాతీయంగా కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతుండటం వంటి పరిణామాలు మార్కెట్లకు సానుకూల అంశాలని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఈ వారమే విడుదలవనున్న సేవా రంగ పీఎంఐ లెక్కలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయొచ్చని తెలిపారు.