తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ వారం మార్కెట్లకు గణాంకాలే కీలకం

ఆర్బీఐ రేపో రేటు తగ్గింపు నిర్ణయంతో గత వారం నష్టాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లపై.. ఈ వారం విడుదల కానున్న పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి.

By

Published : Jun 9, 2019, 7:44 PM IST

ఈ వారం మార్కెట్లకు గణాంకాలే కీలకం

పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన పరిణామాలుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు కూడా కొనసాగొచ్చని పేర్కొంటున్నారు.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నగదు కొరత వంటి సమస్యలు గత వారం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఈ వారం కూడా ఆ సెంటిమెంట్ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

గణాంకాల వెల్లడి ఎప్పుడంటే..

పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ బుధవారం వెల్లడించనుంది ప్రభుత్వం. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మాత్రం శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత వెల్లడికానున్నాయి.

"ద్రవ్యోల్బణం, పరిశ్రమల ఉత్పత్తి, నైరుతి రుతుపవనాలపై అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్​పై మార్కెట్లు ఆశగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఊతమందించే దిశగా ప్రభుత్వం చర్యలుంటాయని అంచనాలున్నాయి."
-వినోద్ నాయర్​, జియోజిత్​ ఫినాన్షియల్ సర్వీసెస్​ అధిపతి.

విదేశీ పెట్టుబడులు, రూపాయి, ముడిచమరు ధరలు కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి:నమో 2.0: 'ఆశల పద్దు'పై ముమ్మర కసరత్తు

ABOUT THE AUTHOR

...view details