తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- మారుతీ 7% జంప్ - సెన్సెక్స్​ వార్తలు

STOCK MARKETS
లాభాల్లో మార్కెట్లు

By

Published : Dec 3, 2020, 9:34 AM IST

Updated : Dec 3, 2020, 4:15 PM IST

10:05 December 03

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 2 శాతం నష్టం..

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 44,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 13,134 వద్దకు చేరింది.

  • మారుతీ అత్యధికంగా 7 శాతానికిపైగా లాభ పడింది. ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అత్యధికంగా 2 శాతానికిపైగా నష్టపోయింది. టీసీఎస్​, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎం&ఎం, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

09:09 December 03

లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 150 ప్లస్

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 44,775 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 51 పాయింట్లు వృద్ధి చెంది 13,164 వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..  

గెయిల్​, ఓఎన్​జీసీ, హిందాల్కో, టాటాస్టీల్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

యాక్సిస్​ బ్యాంక్, ఎస్​బీఐ లైఫ్, ఎమ్​అండ్​ఎమ్​, పవర్​గ్రిడ్, టీసీఎస్ షేర్లు వెనుకబడ్డాయి.

Last Updated : Dec 3, 2020, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details