తెలంగాణ

telangana

ETV Bharat / business

'స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాం' - hyderabad news

కిసాన్​ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్​తో స్థానిక బాషలో రైతులకు సలహాలు, సూచనలు అందించనున్నట్లు నాబార్డు ఛైర్మన్​ జీఆర్​ చింతల తెలిపారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో ప్రారభించిన కిసాన్​ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్​లో భాగంగా మొదటి సందేశాన్ని పంపించారు.

'స్థానిక బాషలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాం'
'స్థానిక బాషలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాం'

By

Published : Aug 29, 2020, 5:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా వేపాడ మండలానికి సంబంధించి... నేడు ప్రారంభించిన కిసాన్‌ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్​లో మొదటి సందేశాన్ని నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల హైదరాబాద్‌ నుంచి పంపించారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన నాబార్డు అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.

'స్థానిక బాషలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాం'

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు అందించే ఉద్దేశంతో కిసాన్​ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్​ ప్రారంభించినట్లు చింతల వివరించారు. పోస్టర్లు, సందేశాలు, వాయిస్‌ మెసేజ్​ల ద్వారా రైతులకు సూచనలను అందించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details