ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం నుంచి ఐపీఓకు బిడ్లను స్వీకరించనుంది. ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) రూ.4,633 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. జనవరి 18వ తేదీ నుంచి దీనికి సంబంధించి బిడ్ల స్వీకరణ మొదలవుతుంది. ఒక్కో షేరు ధర రూ.25-రూ.26 మధ్య ఉండవచ్చు. దీనికి సంబంధించి యాంకర్ ఇన్వెస్టర్ల(సంస్థాగత మదుపర్లు)కు 15వ తేదీ నుంచే బుకింగ్స్ మొదలుపెట్టింది. శుక్రవారం నాటికి రూ.1,398 కోట్లను సేకరించినట్లు సమాచారం. ప్రభుత్వ రంగానికి చెందిన ఒక ఎన్‌బీఎఫ్‌సీ ఐపీఓకు రావడం ఇదే తొలిసారి. లిస్టింగ్‌కు వచ్చిన ఐదో రైల్వే కంపెనీ ఇదే. ఈ ఆఫర్‌లో 50శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు రిజర్వు చేశారు. 15శాతం నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. మిగిలిన 35శాతం వాటాలను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు.
తొలిసారి ఐపీఓకు ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీ - IPO update
గతేడాది కాలంగా ఐపీఓలు మార్కెట్లో అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ నెల 18 నుంచి బిడ్ల స్వీకరణ మొదలుపెట్టనుంది. దీనికి సంబంధించి సంస్థాగత మదుపర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్ ప్రారంభించింది.
రేపటి నుంచి ఐపీవోకు రానున్న ఎన్‌బీఎఫ్‌సీ
ఐఆర్‌ఎఫ్‌సీ వ్యాపారం విభిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రైల్వే మంత్రిత్వశాఖ కానీ నిబంధనలు మారిస్తే దీని లాభంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఈ ఐపీఓలోని ప్రైస్‌బ్యాండ్‌ను చూస్తే కొనుగోలుదారులకు చౌకగానే వాటాలను అందజేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చిన రైల్వే సంస్థలు మొత్తం లిస్టింగ్ సమయంలో లాభాలను అందించాయి. దీంతో ఐఆర్‌ఎఫ్‌సీపై కూడా ఆశలు పెట్టుకొన్నారు.