తెలంగాణ

telangana

ETV Bharat / business

గంటలో రూ.6.86 లక్షల కోట్ల సంపద ఆవిరి! - share market today news

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో సెషన్ ప్రారంభమైన గంటలోపే మదుపరుల సంపద రూ. 6.86 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూడడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Investors' wealth tumbles over Rs 6.86 lakh cr in morning trade as markets crack
రెండు గంటల్లో రూ. 6.86 లక్షల కోట్లు ఆవిరి

By

Published : Apr 12, 2021, 12:11 PM IST

Updated : Apr 12, 2021, 12:25 PM IST

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాల కారణంగా.. సోమవారం సెషన్​ ప్రారంభమైన గంటలోపే రూ.6 లక్షల 86 వేల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూశాయి. ఈ ప్రభావం స్టాక్​మార్కెట్లపై భారీగా పడింది. ఈ క్రమంలో సూచీలు రికార్డు నష్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6,86,708.74కోట్లు తగ్గి రూ. 2,02,76,533.13కోట్లకు చేరింది.

సెన్సెక్స్ దాదాపు1,664 పాయింట్లు పతనమై 47,926 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 14,327 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు మాత్రమే లాభంలో ఉన్నాయి.

ఇదీ చూడండి:మార్కెట్లపై కరోనా కోరలు- సెన్సెక్స్ 1,190 మైనస్​

Last Updated : Apr 12, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details