తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక షేర్ల దన్నుతో మార్కెట్లకు స్వల్ప లాభాలు - స్టాక్ మార్కెట్ తాజా వార్తలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మగిశాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 40,795 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 37 పాయింట్ల మెరుగై 11,971 మార్క్​ వద్ద నిలిచింది.

STOCKS
దేశీయ స్టాక్ మార్కెట్లు

By

Published : Oct 14, 2020, 3:41 PM IST

బ్యాంకింగ్ షేర్ల ఊతంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ(బీఎస్​ఈ)- సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 40,795 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ(నిఫ్టీ) 37 పాయింట్లు బలపడి 11,791 పాయింట్లకు చేరింది.

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆర్థిక షేర్ల దన్నుతో చివరి సెషన్​లో లాభాలు ఆర్జించాయి.

లాభనష్టాల్లో..

బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్ 2 శాతానికిపైగా లాభపడ్డాయి.

ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, టెక్​ మహీంద్ర, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు డీలా పడ్డాయి.

ఇదీచూడండి:'అంచనాలకు మించి భారత వృద్ధి రేటు క్షీణత'

ABOUT THE AUTHOR

...view details