తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప లాభాలు- రాణించిన ఫార్మా షేర్లు - స్టాక్​ మార్కెట్​ లైవ్​

Indices trade higher in pre-opening amid positive global cues
ఆర్థిక షేర్లు డీలా- నష్టాల్లో మార్కెట్లు

By

Published : Apr 6, 2021, 9:27 AM IST

Updated : Apr 6, 2021, 3:45 PM IST

15:41 April 06

స్వల్ప లాభాలు..

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి. సెన్సెక్స్​ 42 పాయింట్లు బలపడి 49,201 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్ పెయింట్స్, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం లాభాలను నమోదు చేశాయి.

పవర్​గ్రిడ్​, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్​ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:16 April 06

అమ్మకాల ఒత్తిడి..

స్టాక్‌ మార్కెట్లోసూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 17 పాయింట్ల అతి స్వల్ప లాభంతో.. 49,176 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా పెరిగి.. 14,662 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటుండటం ఊగిసలాటకు కారణంగా తెలుస్తోంది.

  • ఏషియన్ పెయింట్స్, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్, నెస్లే షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:42 April 06

స్వల్ప లాభాలు..

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 30 పాయంట్లకుపైగా పెరిగి.. 49,194 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో 14,670 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఏషియన్ పెయింట్స్, డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:22 April 06

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 246 పాయింట్లకుపైగా లాభపడి.. 49,406 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగబాకిి.. 14,723 వద్ద ట్రేడవుతోంది. 

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు చేతికి రావడం కారణంగా.. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ షేరు విలువ ఈ ఒక్కరోజే 9.4 శాతం మేర పెరిగింది.

11:49 April 06

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 263, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

30 షేర్ల ఇండెక్స్​లో ఏషియన్​ పెయింట్స్​ మూడు శాతం పెరిగి టాప్​లో ఉండగా.. టైటాన్ నష్టాల్లో చివరి స్థానంలో ఉంది. ​ 

11:12 April 06

లైవ్​: గేర్​ మార్చిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 350 ప్లస్​

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకు పైగా లాభపడి.. 49, 500 మార్క్​ను చేరుకుంది. నిఫ్టీ 117 పాయింట్ల వృద్ధిచెంది.. 14,753 వద్ద కొనసాగుతోంది. 

10:41 April 06

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​సీ-సెన్సెక్స్​ 271 పాయింట్లకుపైగా లాభపడింది. 49,431 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్ఈ నిఫ్టీ 91 పాయింట్లు ఎగబాకింది. 14,726 వద్ద ట్రేడవుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఇక దేశీయంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై మదుపర్లు అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే ఈ వారం విడుదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించారు. 

లాభనష్టాలు.. 

  • పవర్​ గ్రిడ్​,ఏసియన్​ పెయింట్స్​, భారతీ ఎయిర్​టెల్, హిందుస్థాన్​ యూనిలివర్​, బజాజ్​ ఫినాస్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, డా. రెడ్డీస్​, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, రిలయన్స్​, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:09 April 06

స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 100, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

09:31 April 06

పుంజుకుంటున్న ఆర్థిక షేర్లు- లాభాల్లోకి మార్కెట్లు

మంగళవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించిన దేశీయ సూచీలు కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి. బీఎస్​సీ సెన్సెక్స్​ 300 పాయింట్లు కోలుకొని 49,461 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​సీ నిఫ్టీ 96 పాయింట్లు ఎగబాకి 14,734 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాలు.. 

  • పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఎం అండ్​ ఎం, హిందుస్థాన్​ యూనిలివర్​, బజాజ్​ ఫినాస్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, డా. రెడ్డీస్​, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:57 April 06

లైవ్​: ఆచీతూచి అడుగులు వేస్తోన్న మదుపరులు-లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 49 వేల 170 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 14 పాయింట్లు పెరిగి 14,650 ఎగువన ఉంది. 

  • హిందుస్థాన్​  యూనిలీవర్​, పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఆటో, బజాజ్​ఫినాన్స్​, ఎం అండ్​ ఎం షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ఓఎన్​జీసీ, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Apr 6, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details