దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. దేశ జీడీపీ రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహించడం వల్ల ట్రేడింగ్‌లో సూచీలు ఫ్లాట్‌గా కొనసాగాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 110 పాయింట్లు పతనమైంది. ఓ దశలో 44 వేల పాయింట్ల మార్క్‌ను కోల్పోయిన సూచీ తర్వాత పుంజుకుంది. చివరకు 44,150 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం స్వల్పంగా నష్టపోయింది. 18 పాయింట్లు దిగజారి.. 12,969 వద్ద ముగిసింది.