నూతన ఏడాదిలో సరికొత్త శిఖరాల వైపు దూసుకెళుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. జీఎస్టీ చెల్లింపుల్లో భారీ వృద్ధి, టీకా అందుబాటులోకి వస్తుందన్న అంచనాలకు తోడు ఐటీ, ఆటో రంగం, పీఎస్యూ బ్యాంకు షేర్ల దన్నుతో కొత్త ఏడాది తొలి రోజు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి సూచీలు. తొలిసారి నిఫ్టీ 14 వేల ఎగువన స్థిరపడింది.
బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒకానొక దశలో 47,980 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివరకు 118 పాయింట్ల లాభంతో 47,868 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. ఆరంభంలోనే 14 వేల ఎగువన ప్రారంభమై లాభాలను కాపాడుకుంది. ఒక దశలో 14,050 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు 37 పాయింట్ల వృద్ధితో 14,018 వద్ద ముగిసింది.
ఫలితంగా.... దేశీయ మార్కెట్లు వరుసగా 8 సెషన్లో లాభాలతో ముగిసినట్టయింది. డిసెంబర్ 22 నుంచి సుమారు 5 శాతం వృద్ధి సాధించాయి సూచీలు.
లాభనష్టాల్లోనివి..