స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1,252 పాయింట్లు పెరిగి.. 50వేల మార్క్‌ను తాకింది. 50,260 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 365 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 365 వద్ద కొనసాగుతోంది.
ఐటీ షేర్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.
- ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, పవర్‌గ్రిడ్, డా.రెడ్డీస్, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
- ముప్పై షేర్ల ఇండెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.