తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: ఐటీ, ఆటో షేర్ల దన్ను-సెన్సెక్స్@52,900 - స్టాక్ మార్కెట్ లైవ్ ఇండియా

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్(Sensex) 134 పాయింట్లు పుంజుకుని 52,900 మార్క్​ను దాటింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,850 పైకి చేరింది.

stock markets
స్టాక్ మార్కెట్

By

Published : Jul 14, 2021, 3:39 PM IST

కరోనా భయాలున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 134 పాయింట్లు పెరిగి 52,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,854 వద్దకు చేరింది. ఆటో, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,979 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,612 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,878 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,764 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టెక్​ ఎం, హెచ్​సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్​ అండ్ టీ, ఐటీసీ, టాటాస్టీల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

డాక్టర్​ రెడ్డీస్, టైటాన్​, నెస్లే, బజాజ్ ఫినాన్స్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details