తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- రిలయన్స్ జోరు

stock-markets
స్టాక్​ మార్కెట్

By

Published : Feb 11, 2021, 9:24 AM IST

Updated : Feb 11, 2021, 3:48 PM IST

15:45 February 11

స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాల నుంచి తేరుకుని సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 222 పాయింట్ల వృద్ధితో జీవనకాల గరిష్ఠమైన 51,531 వద్దకు చేరింది. నిఫ్టీ 67 పాయింట్లు బలపడి నూతన రికార్డు స్థాయి అయిన 15,173 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ (4 శాతం పైనే), సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​, బజాజ్ ఆటో, నెస్లే, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టైటాన్​, ఎల్​&టీ, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

09:39 February 11

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. గురువారం స్వల్ప నష్టాలతో సెషన్​ ప్రారంభించినా.. కొద్ది సేపటికే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 140 పాయింట్లకుపైగా పెరిగి.. 51,455 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో 15,150 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్​ షేర్ల దన్ను లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్​, భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:13 February 11

ఒడుదొడుకుల్లో సూచీలు..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలతో దేశీయ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. గురువారం ఆరంభ ట్రేడింగ్​లో బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 25 పాయింట్ల నష్టంతో 51,284 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఆరంభ ట్రేడింగ్​లో నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి చేరుకుంది. ప్రస్తుతం 3 పాయింట్ల లాభంతో 15,109 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Feb 11, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details