అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్ 338 పాయింట్లు కోల్పోయి 49,565 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ-నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 14 వేల 906 వద్ద ముగిసింది. బ్యాంకు షేర్లతో పాటు.. విద్యుత్, ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,099 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. 49,497 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
మరో సూచీ నిఫ్టీ 15,070 పాయింట్ల గరిష్ఠాన్ని, 14,885 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.