తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు - nse nifty today

stocks
స్టాక్ మార్కెట్

By

Published : Nov 27, 2020, 10:44 AM IST

Updated : Nov 27, 2020, 11:07 AM IST

10:30 November 27

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 44,205 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 12,977 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..  

బజాజ్​ ఆటో, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫైనాన్స్​, ఏషియన్​ పెయింట్స్, సన్​ఫార్మా, బజాజ్​ ఫిన్​సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

పవర్​గ్రిడ్, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ షేర్లు వెనుకబడ్డాయి.  

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. థ్యాంక్స్​గివింగ్ డే సందర్భంగా అమెరికా మార్కెట్లు గురువారం మూతబడినా.. ఆసియా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా మార్కెట్లపై గురువారం ఒత్తిడి కనిపించింది.

చమురు..  

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్​కు 47.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  

ఇదీ చూడండి:ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

Last Updated : Nov 27, 2020, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details