అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి సెషన్లో లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ స్వల్పంగా 14 పాయింట్లు నష్టపోయి 50,637 వద్ద సెషన్‌ను ముగించింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 15,208 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,961 పాయింట్ల అత్యధిక స్థాయిని, 50,474 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 15,294 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,163 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.