తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక్క సానిటరీ ప్యాడ్​ను 120సార్లు వాడొచ్చు!

హానికరమైన ముడిపదార్థాలతో తయారైన సానిటరీ ప్యాడ్​లు వాడకం... మహిళలకు ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చుతోంది. ఇందుకు ప్రత్నామ్యాయంగా ఓ స్టార్టప్​ అరటి పీచుతో సానిటరీ నాప్కిన్​లను రూపొందించింది. ఒక్కో ప్యాడ్​ను దాదాపు రెండేళ్లు 120 సార్లు ఉపయోగించుకునే వీలుండడం ప్రత్యేకత.

ఒక్క సానిటరీ ప్యాడ్​ను 120సార్లు వాడొచ్చు!

By

Published : Aug 21, 2019, 5:09 AM IST

Updated : Sep 27, 2019, 5:43 PM IST


మహిళలు పాశ్చాత్య ఉత్పత్తులకు అలవాటుపడి ప్రతినెల రుతుస్రావ సమయంలో తెలియకుండానే కాలుష్య కారకాలను పర్యావరణంలో కలుపుతున్నారు. తమ ఆరోగ్యాలనూ చేతులారా పాడు చేసుకుంటున్నారు.

దిల్లీ ఐఐటీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ అంకుర సంస్థ... ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని వినూత్న ప్రయోగం చేసి విజయవంతమైంది. రెండు సంవత్సరాలల్లో 120 సార్లు ఉపయోగించుకునే వీలున్న సానిటరీ ప్యాడ్​ను ఉత్పత్తి చేసింది.

దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ల సహకారంతో సాంఫే సంస్థ అమ్మాయిలకోసం ఈ ఉత్పత్తిని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. సహజసిద్ధమైన అరటి పీచుతో తయారుచేసిన ఈ ప్యాడ్​లు రెండింటికి 199/- రూపాయలుగా ధర ఖరారు చేసింది .

"చాలా రకాల సానిటరీ ప్యాడ్​లు సింథటిక్​, ప్లాస్టిక్​ వంటి ముడి పదార్థాలతో తయారు చేస్తారు. అవి భూమిలో కలవడానికి 50 నుంచి 60 సంవత్సరాల సమయం పడుతుంది. అమ్మాయిలు ఇంట్లో చెత్తబుట్టలో పడేసిన వ్యర్థాలు చివరుకు బహిరంగ ప్రదేశాలకే చేరుతాయి. అనేక రకాల వ్యర్థాలను కలిపి డీకంపోజ్​ చేసే క్రమంలో ఈ సానిటరీ ప్యాడ్స్​ నీటిని, భూమిని, గాలిని తీవ్రంగా కలుషితపరుస్తాయి. వాటిని కాల్చడం ద్వారా కార్కినోజెనిక్​ అనే హానికరమైన పొగ విడుదలవుతుంది. అందుకే ఈ ఉత్పత్తిని రూపొందించాం. పేటెంట్​ కోసం దరఖాస్తు చేశాం."
-అర్చిత్​ అగర్వాల్​, సాంఫే సంస్థ సహ వ్యవస్థాపకుడు

ఇదీ చూడండి:అమ్మతనం ముందు శత్రువేంటి: పిల్లికి పాలిచ్చిన శునకం

Last Updated : Sep 27, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details