గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో(Stock Markets) ర్యాలీ నడుస్తోంది. నష్టాలు వచ్చినా.. స్వల్పకాలానికే పరిమితమవుతున్నాయి. కొవిడ్ తొలి వేవ్ తర్వాత పుంజుకున్న మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు తమ పెట్టుబడులను డైవర్సిఫికేషన్ చేసుకుంటే నష్టభయం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైవర్సిఫికేషన్ అనగానే కంపెనీలు, రంగాలు, పరిశ్రమలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగానే అనుకుంటారు! నష్టభయం తక్కువగా ఉండే విదేశీ మార్కెట్లనూ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి ప్రపంచ దిగ్గజ కంపెనీలు నమోదైన అమెరికా స్టాక్ మార్కెట్లలో(US Stock Markets)మదుపు చేస్తే కచ్చితమైన రాబడితో పాటు లాభాలూ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి అమెరికా మార్కెట్లలో మదుపు చేయడం ఎలాగో చూద్దాం!
అమెరికా మార్కెట్లలో ఎందుకు?
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు 'లిబరలైజ్డ్ రెవెన్యూ స్కీం(ఎల్ఆర్ఎస్)' కింద 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)' అనుమతించింది. ఎలాంటి అనుమతులు లేకుండా రూ.1.9 కోట్ల వరకు మదుపు చేయొచ్చు. మరి అమెరికా మార్కెట్లో ఎందుకు మదుపు చేయాలో కొన్ని బలమైన కారణాలు చూద్దాం!
- భారత స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. అమెరికా మార్కెట్లలో ఊగిసలాట(వొలటాలిటీ) తక్కువ.
- ప్రపంచవ్యాప్త దిగ్గజ కంపెనీలు అమెరికా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. మన పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య డైవర్సిఫై చేసుకునే అవకాశం ఉంటుంది.
- యాపిల్, గూగుల్, ఫేస్బుక్, టెస్లా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల్లో మదుపు చేయొచ్చు. తద్వారా స్థిరమైన వృద్ధి అవకాశాలున్న ఈ కంపెనీల పయనంలో భాగస్వాములం కావొచ్చు.
- అంకుర సంస్థలకు కేంద్రమూ అమెరికాయే. కాబట్టి భవిష్యత్తులో వృద్ధికి అవకాశముండే రంగాల్లో పుట్టుకొస్తున్న వినూత్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టొచ్చు.
అమెరికా మార్కెట్లో మదుపు చేయడం ఎలా?
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం. మరొకటి మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్ ద్వారా పరోక్షంగా స్టాక్ మార్కెట్లలో మదుపు చేయడం. స్థానిక లేదా విదేశీ స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో ట్రేడింగ్ ఖాతా తెరవడం ద్వారా నేరుగా మదుపు చేయొచ్చు. బ్రోకరేజీ సంస్థల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థను బట్టి కొన్ని ఆంక్షలు ఉంటాయి. మదుపు చేసే మొత్తం.. నెలవారీ ట్రేడింగ్ సెషన్స్, డాలర్ల మారకం ఛార్జీలు.. వంటి పరిమితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఇక పరోక్ష పద్ధతిలో పెట్టుబడి పెట్టాలంటే మూడు మార్గాలున్నాయి.
మ్యూచువల్ ఫండ్లు..