తెలంగాణ

telangana

ETV Bharat / business

అతి త్వరలో బంగారం ధరలకు రెక్కలు! - silver prices

అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదలతో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 348 పెరిగింది. కిలో వెండి ధర రూ.50వేలకు చేరువైంది. లాక్​డౌన్​ ఆంక్షల సడలింపుతో రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్ క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Gold
స్వల్పంగా పెరిగిన బంగారం ధర

By

Published : Jun 8, 2020, 7:05 PM IST

అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవటం వల్ల నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 348 పెరిగి, రూ. 46,959కి చేరుకుంది.

పసిడి దారిలోనే వెండి ధరలూ పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ.794 పెరిగి రూ. 49,245కు చేరింది.

" అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 348 పెరిగింది. లాక్​డౌన్​ ఆంక్షల సడలింపుతో ఆర్థిక, రవాణా సేవలు ప్రారంభమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడికి డిమాండ్​ క్రమంగా పెరగనుంది."

- తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ, సెక్యూరిటీస్​ సీనియర్​ విశ్లేషకులు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 1,696 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సుకు 17.68 డాలర్లకు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details