తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి క్షీణతతో పసిడి పైకి- నేటి ధరలు ఇలా.. - భారతదేశంలో బంగారం ధర

రూపాయి పతనంతో పసిడి ధరలు పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.122, వెండి కిలోకు రూ.340 పెరిగింది.

gold price
బంగారం ధర

By

Published : Sep 8, 2020, 4:39 PM IST

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.122 పెరిగి రూ.51,989కు చేరుకుంది.

వెండి ధర కూడా కిలోకు రూ.340 పైకెగిసి రూ.69,665కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ధరలు స్థిరంగా ఉన్నా.. రూపాయి బలహీన పడటం వల్ల బంగారం పెరుగుదలపై ప్రభావం పడిందని రిలయన్స్​ సెక్యూరిటీస్​ సీనియర్​ విశ్లేషకులు శ్రీరామ్​ అయ్యర్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధర ఔన్సుకు 1,930 డాలర్లు, వెండి 26.91 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 52 పాయింట్లు పతనం

ABOUT THE AUTHOR

...view details