తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: భారీగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా.. - Gold price today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర భారీగా పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

GOLD RATE TODAY
ఈరోజు బంగారం ధరలు

By

Published : Oct 14, 2021, 9:34 AM IST

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే గురువారం భారీగా పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా ఏకంగా రూ.790 మేర ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.600 పెరిగి.. రూ.49,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,050 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,300గా ఉంది. కిలో వెండి ధర రూ.64,050 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,050 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,789 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.97 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..

దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price today) గురువారం మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు గురువారం చమురు సంస్థలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

  1. హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటరు ధర రూ. 108.96కు చేరింది. 38 పైసలు పెరిగిన లీటరు డీజిల్ ధర రూ. 102కి పెరిగింది.
  2. వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు ధర రూ.109.81గా ఉంది. డీజిల్ ధర 37 పైసలు అధికమై.. రూ.102.3కు చేరుకుంది.
  3. గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర 35 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 37 పైసలు అధికమైంది. నగరంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 111.08, డీజిల్ ధర రూ.103.53కు చేరుకుంది.

ఇదీ చూడండి:నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..

ఇదీ చూడండి:తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం- పారిశ్రామికోత్పత్తి జోరు

ABOUT THE AUTHOR

...view details