బంగారం(Gold Rate Today), వెండి ధరలో(Silver price today) ఆదివారం ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.48,480 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,370గా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,480గా ఉంది. కిలో వెండి ధర రూ.63,370 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ. 48,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,370 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,757 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 22.69 డాలర్ల వద్ద ఉంది.
మళ్లీ పెరిగిన చమురు ధరలు..
దేశంలో మరోసారి చమురు ధరలు (Petrol Price) పెరిగాయి. (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం చమురు సంస్థలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై (Petrol Price today Hyderabad) 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.108.33, డీజిల్ ధర రూ.101.27కి పెరిగింది.
- విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. (Petrol Price in Vizag) దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.16, డీజిల్ ధర రూ.101.57కు చేరుకుంది.
- గుంటూర్లో (Petrol Price in Guntur) పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 37 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110.42, డీజిల్ రూ.102.8కు చేరింది.
ఇదీ చదవండి:ఆల్‌టైం హై వద్ద పెట్రోల్ రేట్లు- సామాన్యులపై భారం తగ్గేదెలా?
ఇదీ చదవండి:Lpg Gas Cylinder Price: ఇదేమి బండ బాదుడు?