తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక్కరోజులో రూ.1,073 పెరిగిన వెండి ధర - బంగారం ధరలో తగ్గుదల

బంగారం, వెండి ధరలు గురువారం పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.105 పెరిగింది. వెండి ధర ఒక్కరోజులో కిలోకు ఏకంగా రూ.1,073 పుంజుకుంది.

Gold Rate Today in india  gold price india online
ఒక్కరోజులో రూ.1,073 పెరిగిన వెండి ధర

By

Published : Mar 18, 2021, 5:18 PM IST

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.105 పెరిగి.. రూ.44,509కు చేరింది.

కిలో వెండి ధర రూ.1,073 వృద్ధితో రూ.67,364కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,738 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 26.36 డాలర్ల వద్దకు చేరింది.

2023 వరకు కీలక వడ్డీరేట్లను దాదాపు సున్నాకు పరిమితం చేసే యోచనలో ఉన్నట్లు అమెరికా ఫెడ్ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు తెలిపారు.

ఇదీ చదవండి:ఫెడ్​ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం!

ABOUT THE AUTHOR

...view details