తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే భారీగా జంప్ - బంగారం ఇండియా

Gold rate today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం పది గ్రాముల పసిడి రూ.652‬ మేర పెరిగింది. ప్రస్తుతం పసిడి ధర ఎంత ఉందంటే?

gold-rate-today
gold-rate-today

By

Published : Feb 23, 2022, 12:53 PM IST

Gold price today in India: బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర భారీగా పెరుగుతోంది. మంగళవారం 50,518గా ఉన్న పది గ్రాముల పసిడి.. రూ.652‬ మేర ఎగబాకింది. ప్రస్తుతం రూ.51,170 పలుకుతోంది.

మరోవైపు, వెండి ధర సైతం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.1,715‬ వృద్ధి చెంది.. ప్రస్తుతం రూ.66,130 వద్ద ట్రేడవుతోంది.

Gold rate hike

అటు.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర బుధవారం ఫ్లాట్​గా ఉంది. స్వల్పంగా పెరిగిన స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 1899 డాలర్లు పలుకుతోంది.

అంతర్జాతీయ పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలు, అమెరికా బాండ్లపై రాబడి తగ్గడం వల్ల బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అనుమానాల వల్ల.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని చెప్పారు.

మరింత పెరుగుతుందా?

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప కాలంలో రూ.52 వేల మార్క్​ను దాటుతుందని చెప్పారు. ఆ తర్వాత కరెక్షన్​కు గురి కావచ్చని అన్నారు.

ఇదీ చదవండి:చమురుకు రెక్కలు.. త్వరలో పెట్రోల్ రేట్ల మోత.. బండి తీయలేమా?

ABOUT THE AUTHOR

...view details