బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో మంగళవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.297 పెరిగి.. రూ.48,946కు చేరింది. వెండి ధర మాత్రం భారీగా రూ.1,404 పెరిగి రూ.65,380 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,858 డాలర్లుగా ఉంది. వెండి ధర 25.39 డాలర్లకు చేరింది.