తెలంగాణ

telangana

ETV Bharat / business

పెళ్లిళ్ల సీజన్​తో పెరిగిన పసిడి ధర- వెండికీ రెక్కలు - gold prices hikes

పెళ్లిళ్ల సీజన్ రావడం, అంతర్జాతీయ విపణిపై అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ప్రభావం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.78 పెరిగి 39, 263 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ. 245 పెరిగింది.

పెరిగిన పసిడి ధర

By

Published : Nov 4, 2019, 4:32 PM IST

అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ప్రభావం, భారత్​లో పెళ్లిళ్ల సీజన్ ప్రవేశించిన ప్రీమియం లోహాల ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 78 పెరుగుదలతో రూ. 39, 263 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ. 245 పెరిగి రూ. 47, 735 వద్ద ముగిసింది.

"పెళ్లిళ్ల సీజన్ కారణంగా 24 క్యారట్ల బంగారం ధర రూ. 78 పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ప్రీమియం లోహాల విలువ ప్లాట్​గా ట్రేడయింది. "

-తపన్ పటేల్, సీనియర్ విశ్లేషకుడు, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్

అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి 1509 అమెరికన్ డాలర్లు కాగా.. వెండి 18 డాలర్లుగా నమోదయింది.

ఇదీ చూడండి: ప్రపంచ మిలియనీర్ల దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details