తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర - బంగారం న్యూస్ ఆన్​లైన్

దేశీయంగా పసిడి, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.200కి పైగా దిగివచ్చింది. వెండి ధర కిలో రూ.71 వేలకు చేరువలో ఉంది.

GOLD
గోల్డ్

By

Published : May 12, 2021, 4:26 PM IST

బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.229 తగ్గి.. రూ.47,074 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు భారీగా రూ.717 తగ్గి.. రూ.70,807 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,832 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.38 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

అమెరికా ట్రెజరీ బాండ్లలో వచ్చే లాభాల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు దిగివస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు.

ఇవీ చదవండి:వెంటాడిన లాక్​డౌన్ భయాలు- 49000 దిగువకు సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details