తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం, వెండి మరింత ప్రియం- కారణమిదే.. - భారతదేశంలో బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.418 పెరిగింది. వెండి కిలోకు రూ.2,246 పైకెగిసింది.

BIZ-GOLD-PRICE
బంగారం, వెండి

By

Published : Sep 1, 2020, 4:47 PM IST

Updated : Sep 1, 2020, 6:42 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.418 పెరిగి రూ.52,963కు చేరింది.

వెండి కొనుగోలుపైనా మదుపరులు భారీగా ఆసక్తి కనబరిచారు. ఫలితంగా వెండి కిలోకు రూ.2,246 పైకెగిసి రూ.72,793కు పెరిగింది.

"అంతర్జాతీయ ధరల కారణంగా బంగారం ధర భారీగా పెరిగింది. అయితే రూపాయి బలపడడం వల్ల భారత్​లో ఆ పెరుగుదల కొంత స్థాయికే పరిమితం అయింది" అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు.

బలపడిన రూపాయి..

అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73 పైసలు బలపడి 72.86కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,988 డాలర్లకు పెరిగింది. వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్సు ధర రూ.28.77 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:టెలికాం షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు

Last Updated : Sep 1, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details