దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది.
వెండి ధర కూడా కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301కు దిగొచ్చింది.
"కరోనా టీకా క్యాండిడేట్ల తయారీలో పురోగతితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలు పెరిగాయి. అందువల్ల మదుపరులు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. అధికార బదిలీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం, రూపాయి మారకం బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గాయి."