పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.462 పెరిగి 42,339కి చేరుకుంది.
"దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర 42వేల మార్కును దాటింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగిన వేళ దేశంలో రూ.462 పెరుగుదల నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు తోడైంది. "