తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - బంగారం ధరల్లో మార్పులు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.46,102 దిగువకు చేరింది. వెండి ధర రూ.1,274 క్షీణించింది.

gold rates today indian bullion markets updates
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Feb 17, 2021, 4:16 PM IST

Updated : Feb 17, 2021, 4:26 PM IST

దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.717 తగ్గి.. రూ.46,102వద్దకు చేరింది.

వెండి ధర దిల్లీ మార్కెట్​లో రూ.1,274 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,239 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గాయని హెచ్​డీఎఫ్​సీ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,786 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 27.10 డాలర్ల వద్ద ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

Last Updated : Feb 17, 2021, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details