తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.47,000 పైకి చేరింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కు దాటింది.

GOLD
బంగారం ధరలు

By

Published : May 14, 2021, 4:27 PM IST

పసిడి మరింత ప్రియమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం స్వల్పంగా రూ.146 పెరిగి.. రూ.47,110కి చేరింది.

శుక్రవారం వెండి ధర రూ.513 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,191 వద్ద ఉంది.

'అక్షయ తృతీయ' సందర్భంగా బంగారం కొనుగోళ్లు పుంజుకున్న నేపథ్యంలో దేశంలో పసిడి ధరలు పుంజుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1834 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 27.20 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చదవండి:ఫండ్లలో పెట్టుబడి ఉపసంహరణకు సరైన సమయం ఏది?

ABOUT THE AUTHOR

...view details