స్టాక్ మార్కెట్లకు (Stock markets) ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం (Market Outlook) కానున్నాయంటున్నారు విశ్లేషకులు. దీనితో పాటు ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పని చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు.
- వినాయక చవితి సందర్భంగా శుక్రవారం (సెప్టెంబర్ 10న) మార్కెట్లకు సెలవు.
ఈ వారమే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. వాటి ప్రభావం కూడా మార్కెట్లపై పడనుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.
'మొత్తానికి ఈ వారం కూడా మార్కెట్ల జోరు కొనసాగే అవకాశముంది. ముఖ్యంగా కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సినేషన్(Corona Vaccination India) వేగంగా కొనసాగుతుండటం, అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లను ముందుకు నడిపించే వీలుంది.' అని మోతీలాల్ ఓశ్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ విభాగాధిపతి సిద్ధార్థ్ ఖింకా పేర్కొన్నారు.
కరోనా కేసులు(Coronacases India), ముడి చమురు ధరలు, రూపాయి విలువ వంటివి మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి:Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్‌లో స్టార్ తిరిగింది!