దేశీయంగా మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలు ఏమీలేని వేళ.. ఈ వారం సూచీలను అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయి. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటనలు మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇదే క్రమంలో త్వరలో ముగియనున్న ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్ట్‌లతో మార్కెట్ కొంతమేర ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, పెరుగుతున్న కేసులు, చైనా రెగ్యులేటరీ క్రాక్‌డౌన్ వంటి అంశాలపై మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
"మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలు ఈ వారంలో దేశీయంగా లేవు. దీంతో అంతర్జాతీయ పరిణామాలపైనే మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉంది. కరోనా కేసుల్లో పెరుగుదల, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా సూచీలను కలవర పెట్టే అవకాశం ఉంది."
-వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్