తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపరుల అప్రమత్తతతో ఒడుదొడుకుల్లో సూచీలు - సెన్సెక్స్​ తాజా వార్తలు

ఏడాది చివర సెలవులకు ముందు దేశీయ స్టాక్​ మార్కెట్లు స్తబ్దుగా కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్​ ఒడుదొడుకుల్లో సాగుతుండగా.. నిఫ్టీ ఎలాంటి లాభాలు లేకుండా ఫ్లాట్​గా ఉంది.

STOCK MARKETS
STOCK MARKETS

By

Published : Dec 24, 2019, 10:15 AM IST

Updated : Dec 24, 2019, 10:28 AM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. 41,700కు చేరువలో ఉన్న సెన్సెక్స్ ఒడుదొడుకుల్లో కొనసాగుతోంది. నిఫ్టీ ఎలాంటి లాభం లేకుండా 12,262 పాయింట్ల వద్ద ఉంది.

క్రిస్మస్​, కొత్త సంవత్సరాదికి దేశీయ, ప్రపంచ మార్కెట్లకు సెలవుల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

లాభనష్టాల్లో..

రిలయన్స్​ క్యాపిటల్​, రిలయన్స్​ ఇన్​ఫ్రా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హీరోమోటో కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్​, ఓన్​జీసీ, ఎస్​ బ్యాంక్​, ఎం అండ్ ఎం లాభాల్లో సాగుతున్నాయి.

హెచ్​సీఎల్, విప్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో..

షాంఘై మినహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికాలోని వాల్​ స్ట్రీట్​ సోమవారం లాభాల్లో ముగిసింది.

Last Updated : Dec 24, 2019, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details