తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణంతో స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Feb 4, 2019, 10:57 AM IST

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన బాంబే ఎక్స్చేంజీ సూచీ​ ఒక దశలో 160 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 87 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్​ 36 వేల 382 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

జాతీయ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయింది. 10 వేల 865 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్​, ఆటో, లోహ వాటాలపై అమ్మకాల ఒత్తిళ్లు నష్టాలకు మరో కారణం.

అత్యధిక లాభనష్టాల్లోనివివే....

ఓఎన్​జీసీ, ఆర్​ఐఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, వేదాంత, కోల్​ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి. సుమారు 2.39 శాతానికి పైగా వృద్ధి చెందాయి.
యస్​ బ్యాంక్​, టాటా స్టీల్​, హీరో మోటోకార్ప్​, ఐసీఐసీఐ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​ 3.25 శాతం క్షీణించాయి.

రూపాయి పతనం

రూపాయి ఆరంభ ట్రేడింగ్​లోనే భారీగా పతనమైంది. డాలర్​తో పోలిస్తే 71.73 వద్ద ఉన్న మారకం విలువ 48 పైసలు క్షీణించింది.

ABOUT THE AUTHOR

...view details