తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా వార్తలు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం! - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా సంబంధిత వార్తలు, స్థూల ఆర్థిక గణాంకాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Expectations on Stocks for this Week
స్టాక్ మార్కెట్​ అంచనాలు

By

Published : May 9, 2021, 12:55 PM IST

కరోనా సంబంధిత వార్తలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి.

దేశంలో కరోనా వైరస్​ రెండో దశ సునామీలా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కేసులు, టీకా సంబంధిత అప్​డేట్స్​ మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంటున్నారు.

మార్చి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్​ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశమున్నట్లు జియోజిత్ ఫినాన్షియల్​ సర్వీసెస్ పరిశోధనా విభాగాధిపతి వినోద్​ నాయర్​ తెలిపారు. ఈ గణాంకాలు మార్కెట్లకు కీలకం కానున్నట్లు పేర్కొన్నారు.

ఈ వారం స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పని చేయనున్నాయి. 'ఈద్​ ఉల్​ ఫితర్' సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు. మార్కెట్ల పని దినాలపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని చెబుతున్నారు స్టాక్ బ్రోకర్లు.

ఏప్రిల్​లో స్టాక్ మార్కెట్ల నుంచి రూ.9,659 కోట్ల విదేశీ సంస్థ గత పెట్టుబడులు వెనక్కెళ్లాయి. మే మొదటి వారంలో ఏకంగా రూ.5,936 కోట్ల పెట్టుబడులను మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు విదేశీ మదుపరులు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మార్కెట్లకు భారీ నష్టాలకు తప్పకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

వీటన్నింటితో పాటు వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్​డౌన్​లు, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:'స్టాక్స్​'లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా?

ABOUT THE AUTHOR

...view details