తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన పసిడి ధర- నేటి లెక్కలు ఇలా.. - బంగారం ధర

పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.191 తగ్గి.. రూ.52,452 వద్ద స్థిరపడింది.

gold price
బంగారం ధర

By

Published : Sep 11, 2020, 4:26 PM IST

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర 10 గ్రాములపై రూ.191 తగ్గి.. రూ.52,452 వద్ద స్థిరపడింది.

వెండి కూడా కిలోకు రూ.990 తగ్గి రూ.69,441కు చేరింది.

అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు తగ్గాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ విశ్లేషకుడు తపన్ పటేల్ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు 1,943 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర ఔన్సుకు 26.78 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఆటుపోట్ల నడుమ ఫ్లాట్​గా మార్కెట్ సూచీలు

ABOUT THE AUTHOR

...view details